Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్ రాజకీయాల్లో కొత్త మలుపు... మాంఝీకి మద్దతు పలికిన ఏడుగురు మంత్రులపై జేడీయూ వేటు

క్షణక్షణానికి మారిపోతున్న బీహార్ రాజకీయాలు కొద్దిసేపటి క్రితం కొత్త మలుపు తిరిగాయి. జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్ పక్షాన నిలిచిన ఏడుగురు మంత్రులు తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి మద్దతు పలికారు. దీంతో కంగుతిన్న జేడీయూ, మాంఝీకి మద్దతు పలికిన ఏడుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే మాంఝీని పార్టీ నుంచి బహిష్కరించిన జేడీయూ, తాజాగా ఏడుగురు మంత్రులనూ బహిష్కరించింది. ఈ చర్యతో నితీశ్ కు మద్దతు తగ్గుతుండగా, మాంఝీ బలం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ నెల 20న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరగనున్న విశ్వాస పరీక్షలో మాంఝీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

More Telugu News